How To Choose The Right Builder…

1.Experience of the builder :

మీరు ఎంచుకున్న బిల్డర్ సంస్థలో సంవత్సరాల తరబడి ఉన్నట్లయితే మరియు అతను/ఆమె ఎల్లప్పుడూ ఆ ప్రాంతంలో పనిచేస్తున్నట్లయితే వారి ద్వారా అందించే సేవలు సంతృప్తికరమైనవి నాణ్యతగా ఉంటాయి. ప్రత్యేకమైన పరిశ్రమలో ఎక్కువ సంవత్సరాలు, అదనపు అవగాహన. సరైన అనుభవం ఉన్న బిల్డర్ నాణ్యమైన ( Quality of the builder ) ఇళ్లను నిర్మించగలరని మీరు సాధారణంగా నిర్ధారించుకోవచ్చు. కాబట్టి, బిల్డర్‌ను నిర్ణయించేటప్పుడు ఆ  నిర్దిష్ట సంస్థలో బిల్డర్ స్థాయిని పరీక్షించడానికి ప్రయత్నించండి. బాగా అనుభవం ఉన్న బిల్డర్ తన అనుభవాన్ని మీ కార్యక్రమాలకు అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తాడు, అది మరింత శక్తివంతం చేస్తుంది.

2. Success rate :

మనం ఏదైనా బిల్డర్ కంపెనీ ( Builders Company ) నీ సెలెక్ట్ చేస్కునే ముందు వారి అనుభవం తో పాటుగా , వారి యొక్క సక్సెస్ రేట్ ను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ఒక కంపెనీ 50 సంవత్సరాల నుండి 100 ప్రాజెక్ట్ లు చేయగా అందులో 60 మాత్రమే సక్సెస్ అయ్యాయి. అలాగే మరో కంపెనీ 30 సంవత్సరాల నుండి 50  ప్రాజెక్ట్ లు చేయగా అందులో 40  ప్రాజెక్ట్ లు బాగా సక్సెస్ అయ్యాయి. దీనిని బట్టి మనం  ఒకటి నిర్ణయించుకోవచ్చు మొదటి కంపెనీ 50 సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ ఆ కంపెనీ యొక్క సక్సెస్ రేట్ చాల తక్కువగా ఉంది కాబట్టి ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీ ( Real estate company ) నీ సెలెక్ట్ చేస్కునే ముందు ఆ కంపెనీ యొక్క సక్సెస్ రేట్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

 3. The one who meets your needs :

ఒక కంపెనీ యొక్క అనుభవం , సక్సెస్ రేట్ గురించి తెలుసుకున్నాక మనం తెలుసుకోవాల్సిన మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ కంపెనీ మనకు ఏ ఏ సదుపాయాలు మరియు వారి ద్వారా మనకు ఏ విధమైన లాభాలు చేకూరుతాయే చూసుకోవాలి. ఉదాహరణకి ఆ కంపెనీ నుండి మనం ఏదైనా సర్వీస్ తీసుకున్నాక ఆ సర్వీస్ తో పాటుగా మనకు ఏ విధమైన అదనపు సర్వీస్ లు లభిస్తున్నాయేమో చూసుకోవాలి. అలాగే మీకు ఆ కంపెనీ నుండి అన్ని సదుపాయాలు ( services offered by the builder ) లభిస్తున్నాయా లేదా, మనం అనుకున్న విదంగా మనకు కావాల్సిన సర్వీసులు ఉన్నాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఇంటిని నిర్మించేటప్పుడు, మీరు మీ ప్రాజెక్ట్‌కి జోడించాల్సిన విభిన్న ఆలోచనలను కలిగి ఉంటారు. కొన్నిసార్లు మీరు అంతర్జాతీయ స్టైల్ డిజైన్ లేదా మరేదైనా డిజైన్ ద్వారా అనుకుని ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ కంపనీ నిర్మించగలదో ( Construction capability of the company ) లేదో చూసుకోవాలి.

4. Number of ongoing projects :

ఒక కంపెనీ గురించి మీరు మరి కొంత విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఆ కంపెనీ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఒక కంపెనీ నాణ్యమైన సర్వీసులు ప్రొవైడ్ చేస్తే ఆ కంపెనీ కి కస్టమర్స్ ఎక్కువ సంఖ్యలో ఉండి ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. మీరు ఈ విషయం గురించి తెలుసుకునేటప్పుడు ఇంకో విషయం కూడా పరిగణలోనికి తీసుకోవాలి అది ఏంటంటే కొన్ని కంపెనీ లు తక్కువ ప్రాజెక్ట్ లే చేస్తున్నప్పటికీ చాల నాణ్యమైన మరియు సరసమైన ధరలకు సర్వీస్ లు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఈ విషయాన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఆ కంపెనీ లో పనిచేసే, మీకు తెలిసిన ఉద్యోగులను అడిగితే మీకు మరింత సమాచారం తెలుస్తుంది. 

5. Testimonials of the existing customers :

ప్రధానంగా ఒక కంపెనీ యొక్క సర్వీసుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ కంపెనీ ద్వారా సర్వీసులను తీసుకున్న వ్యక్తుల నుండి వారి యొక్క అనుభవాలను తెలుసుకోవడం చాల మంచిది. ఈలాంటి విషయాలని ఈమధ్య కాలంలో చాల కంపెనీస్ వాటిని వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి వీటిని వారి వెబ్సైట్ ద్వారా తెలుసుకోండి, వీటిని టెస్టిమోనల్స్ రూపం లో పొందుపరచడం జరుగుతుంది. ఈ టెస్టిమోనల్స్ ద్వారా మనం చాల విషయాలు తెలుసుకోవచ్చు ఒక కంపెనీ గురించి కాబట్టి వీటి మీద కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు వీటిని తెలుసుకోవడం లో కొద్దిపాటి సమయం వృధా అయినా పర్లేదు. ఒకసారి ఈ మా వెబ్సైటు ను https://www.kurnoolhousing.in/  వీక్షించండి మీకు మరిన్ని విషయాలు తెలుస్తాయి మరియు మా సర్వీస్ ల గురించి తెలుసుకోండి.

6. Materials used by that company :

ఒక కంపెనీ వాడుతున్న మెటీరియల్స్ ఆధారంగా ఆ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ ల గురించి తెలియజేయచ్చు. కాబట్టి కంపెనీ ఉపయోగిస్తున్న మెటీరియల్స్ తెలుసుకోవడం లో ఎలాంటి నిర్లక్ష్యం చూపవద్దు. మార్కెట్ లో ఉన్న అన్ని నాణ్యమైన మెటీరియల్స్ ఉపయోగిస్తూ ఉంటె మనకు అదనంగా ఒక సర్వీస్ పొందుతున్నామని అర్థం చేస్కోవచ్చు. ఒక ఇల్లు లేదా ఏదైనా నిర్మించడం లో చాల రక రకాల మెటీరియల్స్ ఉపయోగిస్తూ ఉంటారు.. అందులో కొన్ని ఇసుక, ఇనుము. మీరు ఈ  విషయం పై కొద్దిగా జ్ఞానాన్ని సంపాదించాలంటే మార్కెట్ లో నిర్మాణానికి వాడే పలు రకాల నాణ్యమైన వాటి గురించి తెలుసుకోండి.

7. Number of days for completion of house :

మీరు కోరుకున్న మరియు అనుకున్న ధరలకు బిల్డర్ ఎన్ని రోజులలో మీ గృహాన్ని నిర్మించి ఇస్తారో కనుక్కోవడం చాల ముఖ్యం కాబట్టి ముందుగానే అన్ని కనుక్కొని బిల్డర్ ని ఎంచుకోవాలి. కొంతమంది వ్యక్తులు వారి సొంత ఇంటి కోసం అద్దె ఇంట్లో ఉండి మరి సొంత ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తారు కాబట్టి గృహ నిర్మాణం ఏమాత్రం ఆలస్యం అయినా చాల ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి మనకు అనుకున్న సమయం లో ఇంటిని నిర్మించే వారిని ఎన్నుకోవడం చాల ముఖ్యం.

8. Don’t fall for relative / friend’s recommendation without doing prior investigation :

ఒక మంచి బిల్డర్ నీ ఎంచుకునే విషయం లో పక్కవారి సలహాలను అడగడం మంచిదే కానీ వారి సలహాల మీద ఆధారపడి ముందుకు గుడ్డిగా వెళ్తే చాల ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి వారి సలహాలను విన్న తర్వాత అది ఎంత వరకు నిజం అన్నది మిరే స్వయంగా తెలుసుకోండి.

9. Check out the Company Website :

రోజు రోజుకు పెరుగుతున్న ఇంటర్నెట్ వాడక దృష్ట్యా చాల కంపెనీ లు వారి వ్యవహారాలన్నింటిని తమ వెబ్సైటు లో ఉంచడం జరుగుతుంది. అలాగే వారి సర్వీసెస్ తీసుకున్న వారి నుండి కొన్ని టెస్టిమోనల్స్ కూడా వారు అక్కడ పొందుపరచి ఉంటారు, అలాగే ఆ కంపెనీ యొక్క సీఈఓ , మేనేజర్, చిరునామా , పనిచేసే సమయాల వివరాలు తెలుసుకోవచ్చు.

10. Location :

చాలా మంది బిల్డర్‌లు వారి ధర అత్యంత పోటీతత్వం ( High Demand Pricing Lands or Properties ) ) ఉన్న ఇష్టమైన ప్రాంతాన్ని కలిగి ఉంటారు, కాబట్టి మీ ప్రతిపాదిత ప్రాంతంలో నిర్మించిన ఇళ్ల యొక్క మంచి నమూనా ఉన్న బిల్డర్‌ను ఎంచుకోవడం మంచిది. మెట్రో ప్రాంతంలో నిర్మించడం అనేది బయట ఉన్న శివారు ప్రాంతాల ( lands out of city ) కంటే సులభం ఎందుకంటే ప్రతిదీ చేతికి దగ్గరగా ఉంటుంది. చాలా మంది వ్యక్తులు పని చేయకూడదని చెప్పడానికి ఇష్టపడరు, కానీ బిల్డర్‌పై ఆధారపడటానికి తక్కువ ఎంపికలు ఉన్నందున వారు సౌకర్యవంతంగా లేని చోటికి వెళ్లడానికి బిల్డర్‌పై మొగ్గు చూపడం వలన అదనపు ఖర్చులు మరియు సైట్‌లో జాప్యం వంటి సమస్యలు వస్తాయి.

How To Choose The Right Builder…

1.Experience of the builder : మీరు ఎంచుకున్న బిల్డర్ సంస్థలో సంవత్సరాల తరబడి ఉన్నట్లయితే మరియు అతను/ఆమె ఎల్లప్పుడూ ఆ ప్రాంతంలో పనిచేస్తున్నట్లయితే వారి ద్వారా అందించే సేవలు సంతృప్తికరమైనవి నాణ్యతగా ఉంటాయి.

Read More »
Book your site visit

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now